నాని, మారుతిల హిట్ కాంబినేషన్లో మరోసారి రిపీట్ కాబోతోందా?
ఒక సినిమాకి సీక్వెల్ చెయ్యాలన్న ఆలోచన వచ్చిందంటే ఆ సినిమా కమర్షియల్‌గా చాలా పెద్ద హిట్ అయ్యిందని అర్థం. అలాంటి సినిమాలనే ఎక్కువగా సీక్వెల్స్ ప్లాన్ చేస్తారు. ఈ ట్రెండ్ బాలీవుడ్లో ఎక్కువగా ఉండేది. ఇప్పుడు టాలీవుడ్లో కూడా స్టార్ట్ అయిందని చెప్పాలి. ఆమధ్య కొన్ని సీక్వెల్స్ వచ్చాయి. కానీ, అనుకున్న రేంజ్లో సక్సెస్ అవ్వలేదు. బాహుబలికి మాత్రమే ఆ భారీ సక్సెస్ దక్కింది. తాజాగా డైరెక్టర్ తేజ తన తొలి సినిమా `చిత్రం`కు సీక్వెల్‌ను రూపొందించే పనిలో ఉన్నాడు. ఇప్పుడు మరో సక్సెస్ఫుల్ డైరెక్టర్ మారుతి కూడా అదే ఆలోచనలో ఉన్నాడు. డైరెక్టర్‌గా తన కెరీర్‌ని, తన ఇమేజ్‌ని టర్న్ చేసిన `భలే బలే మగాడివోయ్` చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఈరోజుల్లో, బస్‌స్టాప్ వంటి యూత్‌ఫుల్ మూవీస్ చేసి డైరెక్టర్‌గా సక్సెస్ అయినా అతనిపై ఒకరకమైన ముద్ర పడింది. ఆ తర్వాత ప్రేమకథా చిత్రమ్ పేరుతో ఓ సినిమా తీశాడు. దానికి దర్శకుడిగా సినిమాటోగ్రాఫర్ ప్రభాకర్‌రెడ్డి పేరు వేసినా డైరెక్ట్ చేసింది మారుతేనని అందరికీ తెలుసు. అలా తనపై ఉన్న ఇమేజ్ను కాస్త మార్చుకోగలిగాడు. ఆ సినిమా తర్వాత అల్లు శిరీష్‌తో `కొత్తజంట` అనే సినిమా చేశాడు. కానీ, అది సక్సెస్ అవ్వలేదు. ఇలా లాభం లేదనుకొని నానితో ఓ పూర్తి స్థాయి ఎంటర్టైనర్ `భలే భలే మగాడివోయ్`తో సూపర్‌హిట్ కొట్టాడు. ఇక అప్పటి నుంచి యూత్‌తోపాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా మారుతికి దగ్గరయ్యారు. ఆ ధైర్యంతోనే బాబు బంగారం, మహానుభావుడు, శైలజారెడ్డి అల్లుడు చిత్రాలు చేశాడు. ఈ సినిమాలు ఏవరేజ్ అనిపించుకున్నా ఆ తర్వాత చేసిన ప్రతిరోజూ పండగే బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇది గత సంవత్సరం రిలీజ్ అయిన సినిమా.
ఇక అప్పటి నుంచి ఏ సినిమా చెయ్యాలి, ఎవరితో చెయ్యాలి వంటి ఆలోచనలు చేస్తున్నాడు. మరో పక్క సోషల్ మీడియాలో మారుతి ఆ సినిమా చెయ్యబోతున్నాడు, మారుతి ఈ సినిమా చెయ్యబోతున్నాడు వంటి న్యూస్‌లు వస్తూనే ఉన్నాయి. ఫైనల్‌గా మారుతి `భలే భలే మగాడివోయ్` చిత్రానికి సీక్వెల్ చెయ్యాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. నానితో ఈ ప్రాజెక్ట్ గురించి చర్చించడం, కథ వినిపించడం కూడా జరిగిపోయిందట. ఈ సినిమా చేసేందుకు నాని కూడా సుముఖంగానే ఉన్నాడని సమాచారం. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.













