విలన్‌గా నాని మెప్పిస్తాడా?
చేసిన సినిమాలతో నేచురల్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నాడు నాని. రెగ్యులర్ సినిమాలూ చేస్తూనే ప్రయోగాలు పండించేందుకు ఇష్టపడే నాని తొలిసారి విలనిజాన్ని చూపించే సన్నాహాల్లో ఉన్నాడట. తనను స్క్రీన్‌ను పరిచయం చేసిన దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణతో చేస్తున్న ఆ ప్రాజెక్టు. ఇప్పటికే సగం షూటింగ్ పూర్తి చేసుకున్న ప్రాజెక్టు.. తాజాగా మనాలిలో తాజా షెడ్యూల్ మొదలెట్టినట్టు సమచారం. ఈ షెడ్యూల్లో కీలక పన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేయనున్నారట. సినిమాలో నాని నెగెటివ్ షేడ్స్ వున్న హీరో రోల్ చేస్తున్నాడా? పూర్తి నెగెటివ్ రోల్ చేస్తున్నాడా? అన్న సందిగ్దం లేకపోలేదు. నాని పూర్తిగా నెగెటివ్ రోల్‌నే చేస్తున్నాడన్నది ఇన్సైడర్స్ సమాచారం. ప్రాజెక్టులో హీరో సుదీర్‌బాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు. నివేదా థామస్, ఆదితీరావ్ హైదరి హీరోయిన్లు, దిల్‌రాజు నిర్మిస్తోన్న సూపర్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌లో తన విలనిజంతో నాని ఏ మేరకు మెపిస్తాడో చూడాలి.













