జెర్సీ కలెక్షన్లపై స్పందించిన నాని
టాలీవుడ్లో నాచురల్ స్టార్ నాని అంటే మినిమమ్ గ్యారెంటీ హీరో అని పేరుంది. తన ప్రయాణంలో చాలా వరకు క్లాస్ సినిమాలు చేసాడు. నాని అంటే ఒక్క క్లాస్ మూవీసే కాదు మాస్ సినిమాలు కూడా చేయగలడని ‘దసరా’ మూవీతో సమాధానం చెప్పాడు. దసరా సినిమా పెద్ద స్టార్ హీరో మూవీస్ తో పోటాపోటీగా ఓపెనింగ్స్ అందుకొంది. ఈ సినిమాలో నాని మాస్ లుక్స్ లో కనిపించి మెప్పించాడు.
అయితే ఇప్పుడు నాని తిరిగి తన పాత స్టైల్ లోకి మారిపోయాడు. తను తాజాగా చేస్తున్న సినిమా ‘హాయ్ నాన్నస. ఈ సినిమా డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా టీజర్ లాంచ్లో నాని కొన్ని విషయాలను ప్రస్తావించాడు. కలెక్షన్లను బట్టి సినిమా హిట్టా,ఫ్లాపా అనేది డిసైడ్ చేయలేమని నాని అన్నాడు. అంతేకాదు తన సినిమాల్లో జెర్సీ, శ్యామ్ సింగరాయ్ లాంటివి కమర్షియల్ గా వర్కవుట్ అవలేదే మాటలను నాని ఖండించాడు.
జెర్సీ సినిమాకు పది రూపాయలు పెడితే యాభై రూపాయలొచ్చాయని, ఆ మూవీ వల్ల బాగానే లాభం వచ్చిందని, థియేటర్లలో కూడా జెర్సీ బాగా పెర్ఫార్మ్ చేసిందని, లాభం అనేది ఒక్క థియేటర్లో వచ్చిన కలెక్షన్లు మాత్రమే కాదని, ఆ మూవీ కి సంబంధించిన శాటిలైట్ మరియు డిజిటల్ రైట్స్ అన్ని కలిపితే వచ్చే ఆదాయమన్నాడు.
వీటితో పాటు రీమెక్ రైట్స్ ,డబ్బింగ్ వీటి ద్వారా కూడా కలెక్షన్లు వస్తాయన్నాడు. ఇలా చూస్తే జెర్సీ, శ్యామ్ సింగరాయ్ మంచి విజయాన్ని అందుకొన్నాయని, అంటే సుందరానికి విషయంలో కొంచెం తేడా జరిగిందని, తను చేసిన మిగిలిన క్లాస్ మూవీస్ అన్నీ బాగానే ఆడాయని, అలానే ‘హాయ్ నాన్న’ కూడా క్లాస్, మాస్ తేడా లేకుండా మంచి సక్సెస్ను ఇస్తుందని నాని చాలా నమ్మకంగా చెప్పాడు.













