ఆ సినిమాపై నాని సూపర్ కాన్ఫిడెన్స్
దసరా సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్న నాని ఇన్నాళ్లు సేఫ్ జోన్ లో మాత్రమే సినిమాలు చేశాడు. కానీ దసరాతో నాని మాస్ క్యారెక్టర్లు చేయలేడన్న అందరి నోళ్లూ మూయించాడు. డైరెక్టర్ శ్రీకాంత్ మీద నాని పెట్టుకున్న నమ్మకమే ఈ సినిమాకు మొదటి సక్సెస్ అని చెప్పాలి. దసరా సినిమాతో నాని తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు.
ఇక నాని ఎలాంటి సినిమా అయినా చేయగలడనే కాన్ఫిడెన్స్ ప్రేక్షకులకి ఇచ్చాడు.ఇదిలా ఉంటే నాని తన తర్వాతి సినిమాను శౌర్యువ్ అనే కొత్త డైరెక్టర్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. నాని కెరీర్లో 30వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతుందట. ఇప్పటికే మూవీ షూటింగ్ ముగింపు దశకు చేరుకుందని, ఈ సినిమా నాని కెరీర్లో సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుందని తెలుస్తోంది.
మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ కూడా మరో కీలక పాత్ర చేస్తుండటం విశేషం. నాని తండ్రి పాత్రలో చేస్తున్న ఈ సినిమాతో ఫ్యామిలీ ఎమోషన్స్ తో మరోసారి నాని తన సత్తా చూపనున్నాడని అంటున్నారు. ఈ సినిమాకు హాయ్ డాడీ అనే టైటిల్ పరిశీలనలో ఉందని తెలుస్తోంది. ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ రషెస్ చూసిన నాని, సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడని, తన ఖాతాలో మరో హిట్ ఖాయమంటున్నాడని సమాచారం.
డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమా తర్వాత నాని, హిట్ 3 తో పాటుగా వివేక్ ఆత్రేయతో ఓ సినిమా చేయనున్నాడు. మరి నాని30 తను అనుకున్న ఫలితాన్నిచ్చి, నానికి దసరా ఇచ్చిన బూస్ట్ ను పెంచుతుందో లేదో చూడాలి.













