నాని సినిమా ఆగిపోయిందా?
కొన్ని కాంబినేషన్స్ వినడానికి, చెప్పుకోవడానికి ఎంత బాగున్నా సరే బడ్జెట్ విషయంలో ఆలోచించకుండా ముందుకెళ్తే చాలా సమస్యలు తలెత్తడం ఖాయం. కొన్ని నెలల కిందట మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమాను గ్రాండ్ గా అనౌన్స్ చేశారు. కానీ తర్వాత బడ్జెట్ ఇష్యూస్ వల్ల ఆ సినిమాను ఆపేశారు.
ఆ తర్వాత అది బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ కు వెళ్లింది. గద్దర్2 తర్వాత సన్నీ మార్కెట్ పెరగడంతో ఆయనతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడిదే పరిస్థితి మరో సినిమాకు కూడా ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నాని, సుజిత్ కాంబోలో డీవీవీ దానయ్య బ్యానర్ లో ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందనున్నట్లు ఇప్పటికే అనౌన్స్మెంట్ వచ్చింది.
ఓజీ డైరెక్టర్ సుజిత్ తో నాని సినిమా చేస్తే ఓ రేంజ్ లో ఉంటుందని ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఊహించుకున్నారు కూడా. దానికి తగ్గట్టే సినిమా థీమ్ ను వివరిస్తూ చిన్న టీజర్ ను రిలీజ్ చేశారు. ఆ టీజర్ చూశాక ఇప్పుడు సినిమా బడ్జెట్ ఇష్యూస్ వల్ల ఆగిపోతుందని తెలిస్తే ఫ్యాన్స్ నిరాశ పడటం ఖాయం. ఈ విషయంలో ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇంకా ఎలాంటి అప్డేట్ రాలేదు కానీ ఏ ఇబ్బంది లేకుండా ఇలాంటి వార్తలు బయటకు రావు కదా అని అంటున్నారు. ఏదేమైనా ఓ మంచి కాంబోకు బ్రేక్ పడటం నిరాశ కలిగించే అంశమే.













