లేట్ చేయకూడదంటున్న నాని
దసరా, హాయ్ నాన్న సినిమాలతో వరుస సక్సెస్లు అందుకుని నేచురల్ స్టార్ నాని ఫుల్ జోష్ లో ఉన్నాడు. ప్రస్తుతం నాని, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని ఎంతో కసిగా ఉన్నాడు నాని. ఆగస్ట్ లో రిలీజ్ కానున్న సరిపోదా శనివారం మీద ఆడియన్స్ కు మంచి అంచనాలున్నాయి.
దీని తర్వాత నాని, దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఓ సినిమాను చేయనున్నాడు. దసరా తర్వాత వీరిద్దరి కాంబోలో రానున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. సరిపోదా శనివారం సినిమా రిలీజవగానే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది.
దీంతో పాటూ నాని హిట్3 సినిమాను కూడా సమాంతరంగా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. హిట్2 వచ్చి ఇప్పటికే చాలా రోజులైంది. ఇంకా లేట్ అయితే సినిమాపై ఉన్న బజ్ తగ్గుందనే ఆలోచనతో ఈ సినిమాను కూడా స్టార్ట్ చేయాలని చూస్తున్నాడట నాని. రీసెంట్ గా నాని- శైలేష్ కలిసి హిట్3 విషయంలో ఇక లేట్ చేయొద్దని, వీలైనంత త్వరగా సినిమాను మొదలుపెట్టాలని డిస్కస్ చేసుకున్నారట. శైలేష్ కూడా ఇప్పటికే హిట్3కు సంబంధించిన పనులను పూర్తి చేసుకుని రెడీ ఉన్నట్లు నానికి చెప్పాడట. అంటే నాని ఒకేసారి శ్రీకాంత్ ఓదెలతో సినిమాతో పాటూ హిట్3 కూడా చేయనున్నాడన్నమాట.













