Nani-Srikanth Odela: నాని ఓదెల సినిమా గురించి ఇంట్రెస్టింగ్ లీక్
నేచురల్ స్టార్ నాని(Nani) ఎంతో నమ్మితే కానీ చేసిన డైరెక్టర్ తో మళ్లీ సినిమా చేయడు. ప్రస్తుతం హిట్3(Hit3) సినిమా చేస్తున్న నాని తనకు దసరా(Dasara) లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దసరా తర్వాత వీరిద్దరి కాంబోలో మరో సినిమా రావడం నాని ఫ్యాన్స్ కు మంచి జోష్ ను ఇచ్చింది.
ఈ ఇద్దరూ కలిసి ఈ సారి దసరా కంటే పెద్ద సినిమా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతున్న ఈ సినిమాకు ప్యారడైజ్(Paradise) అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేశారు. అయితే ఈ సినిమా విషయంలో శ్రీకాంత్ (Srikanth) చాలా పెద్ద ప్లానే వేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా గురించి వచ్చిన తాజా సమాచారం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
ప్యారడైజ్ సినిమాను రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నారట. ఈ మధ్య కాన్సెప్ట్ బావుంటే చాలు హీరో రేంజ్ తో సంబంధం లేకుండా దాన్ని రెండు పార్టులుగా రిలీజ్ చేస్తున్నారు. ఈ స్క్రిప్ట్ బాగా రావడం వల్లే సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని శ్రీకాంత్ అనుకుంటున్నాడట. నాని కెరీర్లోనే భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ సినిమాకు ఆర్టిస్టులను, సాంకేతిక నిపుణులను వెతికే పనిలో డైరెక్టర్ బిజీగా ఉన్నాడు.













