మరోసారి దసరా కాంబో
నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన దసరా సినిమా తో నాని మంచి మాస్ హిట్ ను అందుకున్నాడు. అసలు నాని ఇలాంటి క్యారెక్టర్లు చేయగలడా అని అనుకున్న అందరికీ దసరా సినిమాలో తన యాక్టింగ్ తో నాన గట్టిగా సమాధానం చెప్పాడు. నాని కెరీర్ లో దసరా ఓ మైలు రాయి చిత్రంగా నిలిచిపోయింది. దసరా సక్సెస్ ఇచ్చిన బూస్టప్ తో నాని తన తర్వాతి సినిమాను శౌర్యువ్ అనే కొత్త డైరెక్టర్ తో అనౌన్స్ చేశాడు.
హాయ్ నాన్న అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మృణాళ్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా డిసెంబర్లో క్రిస్మస్ కానుకగా రిలీజ్ కానుంది. హాయ్ నాన్న తర్వాత నాని, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తాడని, దానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయినట్లు అందరూ అనుకున్నారు.
కానీ ఇప్పుడు నాని తన డెసిషన్ ను మార్చుకున్నట్లు తెలుస్తోంది. హాయ్ నాన్న సినిమా తర్వాత నాని మరోసారి తనకు దసరా లాంటి మంచి హిట్ ను అందించిన శ్రీకాంత్ ఓదెల తో పని చేయాలనుకుంటున్నట్లు సమాచారం. మరోసారి తెలంగాణ నేపథ్యంలోని కథతో నాని ప్రేక్షకుల ముందుకు రానున్నాడని, ఈ సినిమాలో కూడా నాని దసరా లో మాదిరిగానే రఫ్ లుక్ లో కనిపిస్తాడని అంటున్నారు.













