నాని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడుగా!
ఒక్కో సినిమాతో తన మార్కెట్ ను పెంచుకుంటూ కెరీర్లో ముందుకెళ్తున్న నాని(Nani) సరైన నిర్ణయాలు తీసుకుంటున్నాడని రీసెంట్ గా రిలీజైన వేట్టయాన్(Vettayan) సినిమా ప్రూవ్ చేసింది. రజినీకాంత్(rajinikanth) వేట్టయాన్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక క్యాస్టింగ్ లో డైరెక్టర్ జ్ఞానవేల్(Gnanvel) పెట్టుకున్న ప్రాధాన్యతలో నాని పేరు కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే నానిని కలిసి ఆయన కథ కూడా చెప్పాడు.
ఫాహద్ ఫాజిల్(Fahad Fazil) కనిపించిన దొంగ లేదా ఇన్ఫార్మర్ క్యారెక్టర్ లేకపోతే నెగిటివ్ షేడ్స్ ఉన్న రానా(rana) క్యారెక్టర్లలో ఒకదాన్ని నానికి ఆయన ఆఫర్ చేశాడు. కానీ నాని ఆ ఆఫర్ ను చాలా సున్నితంగా రిజెక్ట్ చేశాడు. రజినీ(rajinikanth), అమితాబ్(amithab) ఉన్న సినిమా అయినా సరే తన పాత్రకు దక్కే ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని వేట్టయాన్ కు నాని నో చెప్పాడు.
ఇప్పుడు వేట్టయాన్ రిలీజయ్యాక నాని తీసుకున్న నిర్ణయం కరెక్టేనని అందరూ అంటున్నారు. నాని ఈ సినిమా చేసినా ప్రత్యేకంగా ఆయనకు ఒరిగిదేమీ ఉండదు. వీటన్నింటినీ ఆలోచించే నాని ఆ సినిమా చేసి ఉండకపోవచ్చు. ఒకవేళ నాని వేట్టయాన్ చేసి ఉంటే మార్కెట్ పరంగా ఇంకాస్త ఎక్కువ బిజినెస్ జరిగేది. కానీ నాని దసరా(Dasara) సినిమా తర్వాత ప్రతీ పాత్ర విషయంలో ఎంతో జాగ్రత్తగా అడుగులేస్తూ కథ విషయంలో అసలు రాజీపడటం లేదని అర్థమవుతుంది.













