సరిపోదా శనివారం బిజినెస్ ప్లాన్ సూపర్
హాయ్ నాన్న సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ అందుకున్న నేచురల్ స్టార్ నాని తన తర్వాతి సినిమాను వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. సరిపోదా శనివారం అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.
ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను దిల్ రాజు సొంతం చేసుకోవడంతో నాని ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. తెలుగు రాష్ట్రాలు రెండూ కలిపి సుమారు రూ.25 కోట్లకు డీల్ జరిగిందని తెలుస్తోంది. యాక్షన్ కం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ సినిమాకు భారీగా ఖర్చు పెడుతున్నట్లు సమాచారం.
సరిపోదా శనివారం సినిమా కోసం డీవీవీ తెలివైన బిజినెస్ వ్యూహాన్ని వాడుతోంది. ఓవర్సీస్, ఓటీటీ రైట్స్, ఇతర భాషల డబ్బింగ్ రైట్స్, శాటిలైట్ రైట్స్ ఇలా మొత్తం కలుపుకుని ఎంత లేదన్నా ఈ సినిమాకు రూ.100 కోట్ల వరకు వస్తుంది. బడ్జెట్ 70 కోట్ల వరకు అయినా దగ్గర దగ్గర రూ.30 కోట్ల వరకు లాభాన్ని చూడొచ్చు. దసరా, హాయ్ నాన్న మంచి హిట్ అవడంతో నాని మార్కెట్ కూడా పెరిగింది. అందుకే సినిమాకు రేటు తో సంబంధం లేకుండా కొనేస్తున్నారు. ఈ సినిమాను దసరా లేదా దీపావళికి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఆ టైమ్ కు పోటీలో ఎవరుంటారనేది చూసుకుని రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారట.













