సరిపోదా హిట్టయితే నానిని అందుకోవడం కష్టమే!
నేచురల్ స్టార్ నాని సినిమా సినిమాకూ వైవిధ్యం చూపిస్తూ తన నటనతో ఆకట్టుకుంటూ వస్తున్నాడు. గతేడాది దసరా లాంటి ఊరమాస్ సినిమాతో మెప్పించి, తర్వాత హాయ్ నాన్న లాంటి క్లాస్ సినిమాతో మెప్పించాడు. ఇప్పుడు నాని హీరోగా సరిపోదా శనివారం అనే సినిమా రానుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించింది.
సరిపోదా శనివారం సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరలవుతుంది. ఇప్పటివరకు ఉన్న అంచనాలను సరిపోదా శనివారం ఇంకా పెంచేసింది. గతేడాది దసరా కు వచ్చిన ఓపెనింగ్స్ చూసి అందరూ షాకైపోయారు. దసరాలో తెలంగాణ యాస ఎక్కువగా ఉండటం వల్ల ఏపీ జనాలు ఈ సినిమాకు అంతగా కనెక్ట్ అవలేకపోయారు.
కానీ ఇప్పుడు సరిపోదా శనివారం లెక్క వేరు. ఈ సినిమాను ప్రాంతీయ బేధాల్లేకుండా ఆడియన్స్ ఎంజాయ్ చేసేలా అనిపిస్తోంది. క్లాస్, మాస్ తేడా లేకుండా అందరినీ ఈ సినిమా సంతృప్తి పరిచేలా ఉంది. ట్రైలర్ లో లానే సినిమాలో కూడా కంటెంట్ బాగుంటే కలెక్షన్ల పరంగా సరిపోదా శనివారం అద్భుతాలు సృష్టించడం ఖాయం. పైగా సోలో రిలీజ్ కాబట్టి ఓపెనింగ్స్ కూడా బాగా వచ్చే ఛాన్సుంది. ఈ సినిమా హిట్ అయితే నాని రేంజ్ టైర్2 హీరోల్లో ఎవరూ టచ్ చేయని స్థాయికి వెళ్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.













