వినాయక చవితి కానుకగా టక్ జగదీష్
నాని, రీతూ వర్మ జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం టక్ జగదీష్. సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మించారు. ఈ చిత్రాన్ని వినాయక చవితి సందర్బంగా సెప్టెంబర్ 10న ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అన్ని వాణిజ్య అంశాలతో రూపొందిన చిత్రమిది. మా చిత్రాన్ని అమెజాన్‌లో డైరెక్ట్‌గా విడుదల చేస్తున్నాం అని చిత్ర యూనిట్ పేర్కొంది. పండగకి మన కుటుంబంతో మీ టక్ జగదీష్ అంటూ భూదేవీపురం చిన్న కొడుకు, నాయుడుగారబ్బాయి టక్ జగదీష్ చెబుతున్నాడు.. మొదలెట్టండి అనే డైలాగ్ ఉన్న వీడియోను నాని తన ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.తమన్, కెమెరా: ప్రసాద్ మూరెళ్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ వెంకటరత్నం (వెంకట్).













