నాని పుట్టినరోజు 23న ‘టక్ జగదీష్’ టీజర్
నాని వరసగా సినిమాలని సెట్స్ మీదకి తీసుకు రావడమే కాదు ఈ ఏడాదిలోనే అన్ని సినిమాలని రిలీజ్ చేయనున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ సినిమాలో నటించాడు నాని. ఈ సినిమాలో రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించారు. షైన్ స్క్రీన్ బ్యానర్ పై హరీష్ పెద్ది, సాహు గారపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 23 న ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ ఇప్పటికే అధికారకంగా ప్రకటించారు.ఇక ఈ సినిమా తర్వాత నాని శ్యామ్ సింగ రాయ్ – అంటే సుందరానికి సినిమాలతో రాబోతున్నాడు. ప్రస్తుతం శ్యామ్ సింగ రాయ్ సినిమా షూటింగ్ దశలో ఉంది. కాగా అంటే సుందరానికి సినిమా షూటింగ్ మొదలవాల్సి ఉంది. ఇక నాని శ్యామ్ సింగ రాయ్ కలకత్తా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుండగా ఈ సినిమా కి టాక్సీవాలా ఫేం రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నాడు. సాయి పల్లవి, కృతిశెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా కూడా సమ్మర్ లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. అయితే ఈ మూడు సినిమాల కి సంబంధించిన అప్డేట్స్ రాబోతున్నాయి.
ఈ నెల 24 న నేచురల్ స్టార్ నాని బర్త్ డే సందర్భంగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ‘టక్ జగదీష్’ సినిమా టీజర్ ను విడుదల చేయబోతున్నారు. అలాగే నాని శ్యామ్ సింగరాయ్ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను విడుదల చేయబోతున్నారు. ఇక మిగిలిన అంటే సుందరానికి సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వబోతున్నారు అన్నది తెలియాల్సి ఉంది. ఇంకా ఈ సినిమా షూటింగ్ మొదలవలేదు కాబట్టి ఎలాంటి అప్డేట్ ఇస్తారన్నది సస్పెన్స్ గా ఉంది. మొత్తానికి నాని నుంచి ఈ నెల 24 న మూడు సర్ప్రైజింగ్ అప్డేట్స్ ఇవ్వబోతున్నాడు. ఇక నాని ఫ్యాన్స్ కి పండుగే.
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘టక్ జగదీష్’ 2021లో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి. ‘నిన్నుకోరి’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత నాని, శివ నిర్వాణ కాంబినేషన్లో అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందుతోంది. నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నాని 26వ చిత్రంగా రూపొందుతోన్న ఈ మూవీని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌లో చిత్రాన్ని విడుదల చేయడానికి వారు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 23 నాని బర్త్‌డే. ఈ సందర్భంగా ఆ రోజు సాయంత్రం 5:04 గంటలకు ‘టక్ జగదీష్’ టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేయనుంది.
ఈ విషయాన్ని తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ వెల్లడించింది. దీనికి సంబంధించిన ఓ మోషన్ పోస్టర్‌ను కూడా సంస్థ షేర్ చేసింది. ఈ మోషన్ పోస్టర్లో యాక్షన్ మోడ్‌లో ఉన్న నాని ఆకట్టుకుంటున్నారు. ఓ విలేజ్‌లోని తాటితోపు దగ్గర చుట్టూ జనం నిల్చొని చూస్తుండగా, చేతిలో బాణాకర్ర పట్టుకొని ప్రత్యక్షమయ్యారు టైటిల్ రోల్ చేస్తున్న నాని. రౌడీల భరతం పట్టడానికి ఆయన రెడీ అయ్యారని ఊహించవచ్చు. తమన్ ఇచ్చిన బీజియం ఉద్వేగభరితంగా ఉంది. ఈ మోషన్ పోస్టర్‌తో నాని క్యారెక్టరైజేషన్ ఏమిటనే ఆసక్తి పెరిగింది.
ఇటీవల విడుదల చేసిన “ఇంకోసారి ఇంకోసారి నీ పిలుపే నా ఎదలో చేరి” అంటూ సాగే మెలోడీ డ్యూయెట్ లిరికల్ వీడియోకు సంగీత ప్రియుల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. దర్శకత్వం వహిస్తుండటంతో పాటు రచన కూడా శివ నిర్వాణ చేస్తున్న ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా, వెంకట్ ఫైట్ మాస్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.













