Nani: ది ప్యారడైజ్ ఒక్కో అప్డేట్ నెక్ట్స్ లెవెల్ అంతే!
మరో వారం రోజుల్లో హిట్3(Hit3) సినిమాతో నాని(Nani) ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ విషయంలో ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్న నాని, హిట్3 ప్రమోషన్స్ లో ఎంతో యాక్టివ్ గా పాల్గొంటున్నాడు. ప్రమోషన్స్ లో భాగంగా నాని యాంకర్ సుమ(Suma)తో ఓ ఇంటర్వ్యూలో పాల్గొని అందులో తన తర్వాతి సినిమా ది ప్యారడైజ్(The Paradise) గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించాడు.
ది ప్యారడైజ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతుందని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దాన్ని ఓ క్రేజీ సినిమాగా రూపొందిస్తున్నాడని, ఈ సినిమా చాలా ఎగ్జైటింగ్ గా ఉంటుందని, సినిమా నుంచి ఏ విజువల్ వచ్చినా అది అందరినీ ఎగ్జైట్ చేయడంతో పాటూ ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా ఎప్పుడెప్పుడు టికెట్ కొనుక్కుందామా అనిపించేలా శ్రీకాంత్ ప్లాన్ చేస్తున్నాడని చెప్పి ఫ్యాన్స్ ను ఊరించాడు నాని.
ది ప్యారడైజ్ ను మామూలు సినిమాలా కాకుండా లార్జర్ దేన్ లైఫ్ మూవీగా శ్రీకాంత్ రూపొందించనున్నాడని, ది ప్యారడైజ్ కూడా అలాంటిదేనని, ఆల్రెడీ గ్లింప్స్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందని, సినిమా దాన్ని మించేలా ఉంటుందని నాని తెలిపాడు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానుందని, ఆ సినిమా ప్రతీ ఒక్కరినీ తప్పకుండా అలరిస్తుందని నాని కాన్ఫిడెంట్ గా చెప్పాడు.






