‘హాయ్ నాన్న’ స్టోరీ ఇదేనా?
దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్న నాని ఆ సినిమాతో వంద కోట్ల క్లబ్లో చేరాడు. ఎప్పుడూ విభిన్న కథలతో ఆడియన్స్ ను అలరించాలని అనుకునే నాని ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు. నాని ప్రస్తుతం తన 30వ సినిమాను వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో శౌర్యువ్ దర్శకత్వంలో చేస్తున్నాడు.
తండ్రీ కూతుళ్ల ఎమోషనల్ జర్నీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు హాయ్ నాన్న అనే టైటిల్‌ను ఫిక్స్ చేసి ఈ మధ్యే టైటిల్ గ్లింప్స్‌ను రివీల్ చేశారు. ఈ గ్లింప్స్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ గ్లింప్స్ చూశాక సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికొస్తుంది.
నెట్టింట్లో సినిమా స్టోరీ ఇదేనంటూ కొందరు చర్చించుకుంటున్నారు. హాయ్ నాన్న మూవీలో మృణాల్ నాని కి కూతురిగా కనిపిస్తుందనేదే ఆ వార్త. ఈ సినిమాలో నాని సైంటిస్ట్‌గా కనిపిస్తాడట. తన కూతురు మృణాల్ ఫ్యూచర్ నుంచి ప్రెజెంట్ కి వచ్చేస్తుందని ఆ టైం లోనే ఆమె నానిని కలుసుకుంటుందని తెలుస్తుంది.
నానితో పాటూ ఎనిమిదేళ్ల వయసులో కూడా చిన్నారి కూడా ఉంటుంది. అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి నాని ఫ్యూచర్ కి వెళ్తాడని, ఆ టైమ్‌లోనే నాని తన ఎనిమిదేళ్ల కూతురిని లేదంటే 25 ఏళ్ల కూతురిలో ఎవరో ఒకరినో మాత్రమే సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుందని, ఆ టైమ్ లో నాని ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాడనేదే అసలు కథగా తెలుస్తోంది. మరి ఈ కథలో నిజమెంతన్నది తెలియాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే.













