మెగాస్టార్ పుట్టినరోజు కానుకగా గ్యాంగ్ లీడర్
మోహన్‌కృష్ణ, హరిణిరెడ్డి జంటగా నటిస్తున్న చిత్రం గ్యాంగ్‌లీడర్. మళ్లీ మొదలవుతుది రచ్చ… అనేది ఉపశీర్షిక. సి.హెచ్.రవికిషోర్బాబు దర్శకుడు. మోహన్‌రావు నిర్మాత. కిషోర రాఠీ, మహేష్ రాఠీ సమర్పిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ మాస్ అంశాలతో రూపొందిస్తున్న చిత్రమిది. విజయవంతమైన చిత్రం పేరుతో తీస్తున్న సినిమా కాబట్టి అందకు తగ్గట్టుగానే తెరకెక్కిస్తున్నాం. 30 శాతం చిత్రీకరణ పూర్తయింది అన్నారు. చిరంజీవి పుట్టిన రోజైన ఆగస్టు 22న చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు. మోహన్‌కృష్ణ, సుమన్, తనికెళ్ల భరణి, మహేష్, చిత్రం శ్రీను, రావూరి రమేష్ తదితరులు నటిస్తున్నారు.













