దసరాకు భలే కలిసొచ్చిందే!
గత వారం రిలీజైన దసరా సినిమా నాని అనుకున్నట్లే బ్లాక్ బస్టర్ వైపుగా పరిగెడుతోంది. మిగిలిన భాషల్లో ఈ సినిమాను పెద్దగా పట్టించుకోకపోయినా, తెలుగులో, ఓవర్సీస్లో మాత్రం ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ తో నిర్మాతతో పాటుగా డిస్ట్రిబ్యూటర్లు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు.
దసరా రెండో వారంలోకి అడుగుపెట్టిన దగ్గరనుంచి కలెక్షన్లు కాస్త తగ్గుముఖం పట్టాయి. వీక్ డేస్ లో బాగా డ్రాప్ అయ్యాయి. దానికి తోడు శుక్రవారం కొత్త రిలీజులు ఎలా ఉంటాయోనని టెన్షన్ పడిన దసరా యూనిట్, ఆ సినిమాల రిజల్ట్ చూసి, ఊపిరి పీల్చుకున్నారు. ఈ వారం రిలీజైన రావణాసుర, మీటర్ సినిమాలకు బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ రాలేదు.
రవితేజ నెగిటివ్ షేడ్స్ కోసం రావణాసురను ఓ సారైనా చూద్దామని కొంతమంది అనుకుంటున్నారు కానీ మీటర్ సినిమాను మాత్రం ఎవరూ కనీసం పట్టించుకోవడం లేదు. దీంతో దసరాకు మళ్లీ కలెక్షన్స్ పికప్ అయ్యే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. మాస్ ఆడియన్స్ చూడటానికి ఈ సినిమా తప్ప మరొకటి లేకపోవడంతో దసరాకు మళ్లీ కలెక్షన్స్ పెరగనున్నాయి.
ఇప్పటికే 100 కోట్ల గ్రాస్ దాటిన దసరాకు కలెక్షన్లు రాబట్టుకోవడానికి మరో వారం టైం దొరికింది. వచ్చే వారం శాకుంతలం, రుద్రుడు తప్ప మరే రిలీజ్ లు లేవు. శాకుంతలం ఫాంటసీ సినిమా కాబట్టి, ఆ ఎఫెక్ట్ దసరాపై పెద్దగా ఉండదు. రుద్రుడు కు హైప్ పెద్దగా లేదు. కాన లారెన్స్ ఇలాంటి సినిమాలతో ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేయగలడు కాబట్టి ఏదైనా మ్యాజిక్ జరిగే ఛాన్స్ లేకపోలేదు. ఎలాగైతే ఏంటి దసరా సినిమాకు గట్టి పోటీ ఇచ్చే సినిమా మరో రెండు వారాల పాటూ లేదనే చెప్పాలి.













