నాని రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
దసరా సినిమాతో తన క్రేజ్, మార్కెట్‌ను పెంచుకున్న నాని, ఆ సినిమాతో వంద కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ప్రస్తుతం నాని, శౌర్యువ్ అనే కొత్త దర్శకుడితో హాయ్ నాన్న అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. హాయ్ నాన్న డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ గా ఉంది.
ఇదిలా ఉంటే దసరా సినిమా బ్లాక్ బస్టర్ తో తన తర్వాతి సినిమాలకు నాని అమాంతం రెమ్యూనరేషన్ పెంచేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే నాని హాయ్ నాన్న సినిమాకు ఏకంగా రూ.22 కోట్ల రెమ్యూనరేషన్ ను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీని తర్వాత డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వివేక్ ఆత్రేయతో చేయనున్న సినిమాకు, శ్రీనివాస్ చిట్టూరి నిర్మాణంలో శిబితో చేయనున్న సినిమాకు నాని రూ.25 కోట్ల రెమ్యూనరేషన్ ను తీసుకోనున్నాడట.
నాని మార్కెట్ ను దృష్టిలో ఉంచుకుని ఎక్కువైనా పర్లేదనుకుంటున్నారట నిర్మాతలు. నాని తో సినిమా అంటే 50 కోట్ల బిజినెస్ గ్యారెంటీగా అవుతుంది. ఒకవేళ సినిమాకు మంచి టాక్ వచ్చి బ్లాక్ బస్టర్ అయితే వంద కోట్ల క్లబ్ లో చేరడం ఖాయం. హాయ్ నాన్న హిట్ అయితే నాని తన పారితోషికం మరింత పెంచినా ఆశ్చర్యపోనక్కర్లేదు.













