తన స్టామినాను ప్రూవ్ చేసుకున్న నాని
క్లాస్ హీరోగా ఆడియన్స్ లో ముద్ర వేసుకున్న నేచురల్ స్టార్ నాని, తన కెరీర్లో ఎక్కువ సినిమాలు కూడా క్లాస్ టచ్ ఉన్న సినిమాలే చేశాడు. మాస్ సినిమాలు నానికి సెట్ కావనే భావనను ఎంసీఏ, దసరా సినిమాలతో పటాపంచలు చేశాడు. దసరా సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్ చూసి ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యపోయారు.
దసరాతో నాని లోని మాస్ యాంగిల్ మొత్తాన్ని ఆడియన్స్ చూశారు. అయితే అలాంటి మాస్ మూవీ తర్వాత నాని హాయ్ నాన్న అనే ఎమోషనల్ ఫిల్మ్ చేశాడు. దానికి తగ్గట్టే హాయ్ నాన్నకు అడ్వాన్డ్స్ బుకింగ్స్ కూడా చాలా డల్ గా సాగాయి. దీంతో ఈ సినిమా కమర్షియల్ గా వర్కవుట్ అవడం కష్టమే అనుకున్నారంతా.
అయితే ఏ జానర్ సినిమా అయినా సరే తన బాక్సాఫీస్ స్టామినా తనదేనని నాని మరోసారి హాయ్ నాన్న వసూళ్లతో క్లారిటీ ఇచ్చాడు. యానిమల్ పోటీని తట్టుకుని మరీ హాయ్ నాన్న మంచి కలెక్షన్స్ ను రాబడుతుంది. 5 రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.44 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ను సాధించిన హాయ్ నాన్న యూఎస్‌లో 1.5 మిలియన్ డాలర్ల వైపుగా దూసుకెళ్తోంది. మొత్తానికి నాని తన స్టామినాను హాయ్ నాన్నతో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు.













