మెట్రోలో మల్టీస్టారర్
నాగార్జున, నాని హీరోలుగా ఓ మల్టీస్టారర్ రూపొందుతోన్న విషయం తెలిసిందే. వైజయంతి మూవీస్ పతాకంపై సి.అశ్వనిదత్ నిర్మిస్తున్నారు. టీ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ చిత్రీకరణ ఈ నెల 18వ తేదీ నుంచి మొదలైంది. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్లోని మియూపూర్ స్టేషన్లో మెట్రో ట్రైన్లో కొన్ని సన్నివేశాలు తీస్తున్నారు. హైదరాబాద్ మెట్రో ట్రైన్లో చిత్రీకరణ జరుపుకుంటున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. అందులో నాని, రశ్మిక మండన్నలతో పాటు సంపూర్ణేష్ బాబు ఉండే సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సన్నివేశాల చిత్రీకరణతో చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది.













