నాని కోసం తమిళ డైరెక్టర్ పడిగాపులు
దసరా, హాయ్ నాన్న సినిమాలతో వరుస సక్సెస్ లు అందుకున్నాడు నేచురల్ స్టార్ నాని. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా జానర్ తో సంబంధం లేకుండా నాని సినిమాలు చేసుకుంటూ కెరీర్ లో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం నాని, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఆ సినిమాకు కావాల్సినంత బజ్ వచ్చేసింది.
సరిపోదా శనివారం తర్వాత నాని, ఓజీ డైరెక్టర్ సుజిత్ తో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత బలగం ఫేమ్ వేణు, దసరా ఫేమ్ శ్రీకాంత్ కు కూడా నాని సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు. ఇంత బిజీ షెడ్యూల్ లో ఉన్న నాని కోసం తనే కావాలని ఓ తమిళ డైరెక్టర్ కావాలని పట్టుబట్టి వెంటబడుతున్నట్లు తెలుస్తోంది.
జై భీమ్ తో గొప్ప ప్రశంసలందుకున్న టీజే జ్ఞానవేల్ ప్రస్తుతం రజినీకాంత్ తో వెట్టయాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర కోసం నానిని అడగ్గా, ఆ పాత్ర తనకు సెట్టవ్వదనే ఆలోచనతో నాని సున్నితంగా తిరస్కరించాడు. దీంతో ఆ పాత్ర రానాకు వెళ్లింది. అయితే నాని కోసం జ్ఞానవేల్ రాజా ఇప్పుడు మరో మంచి సబ్జెక్ట్ ను రెడీ చేశాడట.
రజినీ సినిమా తర్వాత జ్ఞానవేల్ రాజా నానితోనే సినిమా చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన చెప్పిన కథ బాగా నచ్చడంతో నాని కచ్ఛితగా చేద్దామని చెప్పడంతో ఈ సినిమాను అక్టోబర్ తర్వాత స్టార్ట్ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అన్నీ ఓకే అవగానే ఈ విషయంలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. మరి ఈ సినిమాను ఎవరు నిర్మిస్తారు ఏంటనేది తెలియాల్సి ఉంది.













