Nani: హాయ్ నాన్న డైరెక్టర్ తో నాని పీరియాడికల్ డ్రామా

అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన నాని(nani) తర్వాత హీరోగా మారి మంచి సినిమాలు చేస్తూ నేచురల్ స్టార్ నాని గా మారాడు. ప్రస్తుతం నాని ప్రొడ్యూసర్లకు మినిమం గ్యారెంటీ హీరో అయిపోయాడు. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగా బ్యానర్ ను స్థాపించి అందులో కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ సినిమాలు చేస్తూ సక్సెస్‌ఫుల్ గా కెరీర్ ను ముందుకు తీసుకెళ్తున్నాడు నాని.
ప్రస్తుతం దసరా(dasara) ఫేమ్ శ్రీకాంత్ ఓదెల(srikanth odela) దర్శకత్వంలో ది ప్యారడైజ్(the paradise) చేస్తున్న నాని(nani) ఆ సినిమా కోసం కెరీర్ లో ఎన్నడూ లేనంతగా కష్టపడుతున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా ది ప్యారడైజ్ పై భారీ అంచనాలున్నాయి. వచ్చే ఏడాది మార్చిలో ఈ హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్యారడైజ్ తర్వాత స్టైలిష్ డైరెక్టర్ సుజిత్(sujeeth) తో ఓ స్టైలిష్ యాక్షన్ డ్రామాను చేయనున్నాడు నాని. సుజిత్ తో చేయబోయే సినిమా నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కబోతుంది. 2026లో నాని సుజిత్ మూవీ రానుండగా ఆ సినిమా తర్వాత నాని, హాయ్ నాన్న(hi nanna) డైరెక్టర్ శౌర్యువ్(shouryuv) తో సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. శౌర్యువ్ చెప్పిన పీరియాడిక్ డ్రామాగా నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, ఈ సినిమా చూసి హాయ్ నాన్న సినిమాను తీసిన శౌర్యువ్ ఇలాంటి సినిమా తీశాడా అని అందరూ షాకవుతారని, నెక్ట్స్ ఇయర్ సంక్రాంతికి ఈ సినిమా గురించి అప్డేట్ వస్తుందని అంటున్నారు. ఇవి కాకుండా టిజె జ్ఞానవేల్(TJ Gnanavel) తో కూడా ఓ సినిమా చేయడానికి నాని డిస్కషన్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది.