తమ్ముడు ఆ హీరో చేయాల్సిందట
సినీ పరిశ్రమలో ఒకరు వద్దనుకున్న సినిమా మరొకరు చేయడం చాలా కామన్. ఎందుకంటే డైరెక్టర్ చెప్పిన పాయింట్ నచ్చినా వారికున్న కమిట్మెంట్స్ కారణంగా కొన్ని సినిమాలు చేయడానికి వీలుపడదు. అలాంటప్పుడు ఆ కథలు వేరే వాళ్లు చేస్తుంటారు. ఇప్పుడు అలా నాని వద్దనుకున్న సినిమాను నితిన్ చేస్తున్నాడు.
అదే తమ్మడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తన్న ఈ సినిమా బ్రదర్ సెంటిమెంట్ తో తెరకెక్కుతుందని టైటిల్ తోనే అర్థమవుతుంది. ముందు ఈ సినిమాను నానితో చేయాలని ట్రై చేశారు. అయితే నానికి కథ నచ్చినా ఆల్రెడీ MCA సినిమా చేశాడు. ఆ సినిమాలో భూమికకు మరిది పాత్రలో నటించినా, ఆమెకు కష్టం వచ్చినప్పుడు తమ్ముడిలా దాన్ని ఎదుర్కొన్నాడు.
అందుకే కథ బాగున్నా MCA సీన్ రిపీట్ అవుతుందనుకుని తమ్ముడు సినిమాకు నో చెప్పాడు నాని. తను వద్దనుకున్న ఈ కథను నితిన్ ఓకే చేశాడు. రీసెంట్ గా రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే ఈసారి నితిన్ తమ్ముడుతో గట్టిగానే కొట్టేట్టు కనిపిస్తున్నాడు. మరి నాని వద్దనుకున్న సినిమా నితిన్ కు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.













