టక్ జగదీష్ మొదలైంది
నాని కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం టక్ జగదీష్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. రీతువర్మ, ఐశ్వర్యరాజేష్ కథానాయికలు. షైన్‌స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. నాని నటిస్తున్న 26వ చిత్రమిది. పూజా కార్యక్రమాల అనంతరం ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత దిల్‌రాజు క్లాప్‌నివ్వగా, నవీన్ ఏర్నేని కెమెరా స్విఛాన్ చేశారు. రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి నుంచి ప్రారంభిస్తాం. ఔట్‌డోర్ లొకేషన్లలో చిత్రీకరణ జరుపుతాం. నానిని సరికొత్త పంథాలో ఆవిష్కరించే సినిమా ఇది అని చిత్ర బృందం తెలిపింది. జగపతిబాబు, నాజర్, రావు రమేష్, నరేష్, మురళీశర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటో గ్రఫీ: ప్రసాద్ మూరెళ్ల, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, ఆర్ట్: సాహి సురేష్, సంగీతం: తమన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎస్.వెంకటరత్నం (వెంకట్), నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది, రచన-దర్శకత్వం: శివ నిర్వాణ.













