మరో డైరెక్టర్ని పరిచయం చేయనున్న నాని
నేచురల్ స్టార్ నాని హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా తనకు ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. హనుమాన్ తో పాన్ ఇండియా స్థాయిలో పాపులర్ అయిన ప్రశాంత్ వర్మని అ! సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేసింది నానినే. కాంప్లికేటెడ్ గా అనిపించే అ! కథను నిర్మించడానికి ఒప్పుకోవడమే కాకుండా అడిగిన స్టార్ క్యాస్టింగ్ పెట్టి మరీ నాని రిస్క్ చేశాడు. ఆ తర్వాత హిట్ ది ఫస్ట్ కేస్ ద్వారా శైలేష్ కొలనుని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఇప్పుడు జగదీష్ అనే మరో కొత్త టాలెంట్ ను నాని సినీ పరిశ్రమకు తీసుకురానున్నాడు. వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్లో ప్రియదర్శి హీరోగా ఈ సినిమా రూపొందనుందని నాని రీసెంట్ గా జరిగిన డార్లింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అనౌన్స్ చేశాడు.
జగదీష్ అనే పేరు ఫ్యూచర్ లో బలంగా వినిపిస్తుందని కూడా నాని ఈ సందర్భంగా చెప్పాడు. వాస్తవానికి హీరోలు ఇలా డెబ్యూ డైరెక్టర్లకు ఛాన్సులివ్వడం వల్ల ఇండస్ట్రీలోకి కొత్త టాలెంట్ వస్తుంది. డైరెక్టర్లు సరైన సినిమాలు తీయట్లేదని అనుకోవడం కంటే రిస్క్ లేని బడ్జెట్ తో హీరోగా కాకపోయినా నిర్మాతగా అయినా ఇలాంటి ప్రయత్నాలు చేయడం ఇండస్ట్రీకి ఎంతో మంచిది. ఈ విషయంలో నానిని ప్రతీ ఒక్కరూ అభినందించాల్సిందే.













