Rajamouli: రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్టులో నాని
నాని(Nani) హిట్3(Hit3) ప్రమోషన్స్ భాగంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్టుగా రాజమౌళి(Rajamouli) హాజరైన విషయం తెలిసిందే. ఈ సినిమా ఈవెంట్ లో యాంకర్ సుమ(Suma) ఈవెంట్ కు వచ్చిన వారందనీ ఇంటరాగేషన్ చేసి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుంది. అందులో భాగంగానే రాజమౌళిని కూడా సుమ ఓ ప్రశ్న అడిగింది.
మీరు తీయబోయే మహాభారతంలో నాని క్యారెక్టర్ ఫిక్స్ అయిందని విన్నాం. నిజమేనా అని అడగ్గా, దానికి రాజమౌళి ఆన్సర్ ఇచ్చాడు. తాను తీసే మహాభారతంలో నాని ఉంటాడనేది మాత్రం ఫిక్స్ అని చెప్పి ఆడిటోరియంను హోరెత్తించాడు. దీంతో రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ విషయంలో అందరికీ ఉన్న అనుమానాలు తొలగిపోయాయి.
రీసెంట్ గా మహాభారతం ఆధారంగా తన బ్యానర్ లో సినిమా రూపొందుతుందని బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్(aamir khan) చెప్పడంతో రాజమౌళి ఇక ఈ ప్రాజెక్ట్ చేయడేమో అని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు హిట్3 ఈవెంట్ లో రాజమౌళి చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే తన డ్రీమ్ ప్రాజెక్టు ఉంటుందని క్లారిటీ వచ్చింది. అంతేకాదు అందులో ఎంతోమంది స్టార్ క్యాస్ట్ కూడా ఉండనున్నారని అర్థమవుతుంది.






