Karthi29: కార్తీ29లో నాని?

తమిళ టాలెంటెడ్ హీరో కార్తీ(Karthi)కి కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా మంచి డిమాండ్ ఉంది. అందుకే కార్తీ ప్రతీ సినిమా తెలుగులో కూడా సమాంతరంగా రిలీజవుతుంది. తెలుగు అభిమానులు తనపై చూపించే ప్రేమకు కార్తీ కూడా తెలుగు ఇండస్ట్రీపై ఎంతో ప్రేమ చూపిస్తూ ఉంటారు. అందులో భాగంగానే తెలుగు హీరోలతో కూడా కార్తీ క్లోజ్ గా ఉంటారు.
ఆ బాండింగ్ తోనే హిట్3(Hit3) క్లైమాక్స్ లో క్యామియో చేసిన కార్తీ, హిట్3 కు సీక్వెల్ గా రానున్న హిట్4(Hit4) లో మెయిన్ లీడ్ గా నటించనున్నారు. ఇక అసలు విషయానికొస్తే రీసెంట్ గా మిత్రన్(PS Mitran) దర్శకత్వంలో సర్దార్2(Sardar2) షూటింగ్ ను పూర్తి చేసిన కార్తీ, జులై నుంచి కార్తీ29ను సెట్స్ పైకి తీసుకెళ్లున్నారు. ఈ సినిమాకు తమిజ్(Thamiz) దర్శకత్వం వహించనున్నారు. వెట్రిమారన్(Vetrimaran) దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన తమిజ్ గతంలో తానక్కారన్(Thaanakkaran) సినిమాను తీశారు.
తమిజ్ కార్తీ29 ను 1960 బ్యాక్ డ్రాప్ లో స్మగ్లింగ్ ప్లాట్ లో పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. నివిన్ పౌలీ(Nivin Pauly), జయరామ్(Jayaram) కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా గురించి ఇప్పుడో న్యూస్ సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది. కార్తీ29లో టాలీవుడ్ హీరో నాని(Nani) నటించనున్నట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, కార్తీ 29లో నాని గెస్ట్ రోల్ కానీ ఓ పాత్ర కానీ చేసే అవకాశమున్నట్టు చెప్తున్నారు. అయితే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.