విజయ్ డైలాగ్‌ను అనుకరించిన నాని
దసరా సినిమాతో మంచి హిట్ అందుకున్న నేచురల్ స్టార్ నాని, తన తర్వాతి సినిమాను శౌర్యువ్ అనే కొత్త డైరెక్టర్‌తో చేస్తున్నాడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న హాయ్ నాన్న సినిమాతో డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు నాని. ఈ సినిమా ఎమోషనల్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతుంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలు రిలీజై, మంచి ఆదరణ అందుకోగా, రీసెంట్ గా హాయ్ నాన్న నుంచి అమ్మాడి అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సాంగ్ లాంఛ్‌లో భాగంగా నాని మీడియాతో ముచ్చటించాడు. ఆ సమయంలో నానికి మీడియా మిత్రుల్లో ఒకరి నుంచి ఓ రిక్వెస్ట్ వచ్చింది. రీసెంట్గా విజయ్ దేవరకొండ నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ మూవీ నుంచి ఐరనే వంచాలా ఏంటి అనే డైలాగ్‌ను నానిని చెప్పమని కోరారు.
నాని, దానికి బదులుగా, బ్లాక్ బస్టర్ కొట్టాలంటే మసాలా సినిమాలే తీయాలా ఏంటి? యాక్షన్ సినిమాలే తీయాలే ఏంటి అంటూ చెప్పాడు. మొత్తానికి విజయ్ డైలాగ్‌ను అనుకరిస్తూ, నాని ఈ డైలాగ్ చెప్పడం అందర్నీ సర్ప్రైజ్ చేసింది. ఇదిలా ఉంటే నాని నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతోనే విజయ్ దేవరకొండ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.













