Hit3: నాని హిట్3 మ్యూజిక్ పై లేటెస్ట్ అప్డేట్
నేచురల్ స్టార్ నాని(nani) చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలున్నాయి. అందులో ఒకటి శైలేష్ కొలను(Sailesh Kolanu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిట్3(Hit3) మరియు రెండోది శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి(Sudhakar Cherukuri) నిర్మాతగా రూపొందుతున్న ది ప్యారడైజ్ మూవీ(The Paradise). ఈ రెండు సినిమాలపై మంచి అంచనాలున్నాయి.
వీటిలో ముందు రానున్న సినిమా హిట్3. మే 1న హిట్ ది థర్డ్ కేస్ రిలీజ్ కానుంది. ఈ సినిమాలో నాని తన కెరీర్లోనే మొదటి సారి పోలీసాఫీసర్ గా కనిపించనున్నాడు. ఆల్రెడీ మూవీ నుంచి రిలీజైన టీజర్ కు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే ప్రస్తుతం ఈ మూవీ మ్యూజిక్ గురించి ఓ ఆసక్తికర బజ్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది.
ఈ మూవీలో మొత్తం నాలుగు పాటలుండగా, అందులో ఓ మెలోడీ సాంగ్ ఉందట. ఆ పాటను సిద్ శ్రీరామ్(Sid Sriram) పాడాడని, హిట్3(Hit3) నుంచి ఫస్ట్ సింగిల్ గా ఆ పాటే రిలీజ్ కానుందని సమాచారం. మిక్కీ జే మేయర్(Mickey J Mayer) మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో నాని మునుపెన్నడూ చూడని విధంగా కనిపించనుండగా హిట్3లో నెక్ట్స్ లెవెల్ వయొలెన్స్ ఉండనుందని టీజర్ చూశాక అర్థమవుతోంది.













