Chiranjeevi: మెగాస్టార్-శ్రీకాంత్ మూవీ అప్డేట్ ఇచ్చిన నాని
నాని(Nani)తో దసరా(Dasara) సినిమా చేసి మొదటి ప్రయత్నంలోనే డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela). ఆ సినిమా తర్వాత శ్రీకాంత్ కు మంచి డిమాండ్ ఏర్పడింది. దసరా తర్వాత మరోసారి నానితోనే సినిమాను కన్ఫర్మ్ చేసుకుని ది ప్యారడైజ్(The Paradise) అనే సినిమాను తీస్తున్నాడు శ్రీకాంత్ ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi)తో ఓ భారీ సినిమాను చేయనున్నాడు.
డిసెంబర్ లోనే ఈ ప్రాజెక్టును అనౌన్స్ చేస్తూ ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ప్రీ లుక్ పోస్టర్ చూస్తుంటేనే సినిమా చాలా వయొలెంట్ గా ఉండనుందని క్లారిటీ వచ్చింది. అయితే ఈ కాంబోలో సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని మెగా ఫ్యాన్స్ చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మెగాస్టార్-ఓదెల మూవీపై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.
చిరూ- శ్రీకాంత్ మూవీకి సమర్పకునిగా వ్యవహరిస్తున్న నేచురల్ స్టార్ నాని రీసెంట్ గా దీనిపై అప్డేట్ ఇచ్చాడు. మెగాస్టార్ దర్శకత్వంలో శ్రీకాంత్ దర్శకత్వం వహించనున్న సినిమా నెక్ట్స్ ఇయర్ లో ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం శ్రీకాంత్ ది ప్యారడైజ్ సినిమాతో బిజీగా ఉండగా, ఆ సినిమా పూర్తయ్యాకే చిరూ సినిమాను మొదలుపెట్టనున్నట్టు తెలుస్తోంది. ఈలోగా చిరూ(Chiru) కూడా విశ్వంభర(Viswambhara)తో పాటూ అనిల్ రావిపూడి(Anil Ravipudi) సినిమాను కూడా పూర్తి చేసుకుని శ్రీకాంత్ కోసం ఫ్రీ అవనున్నాడు.













