Nani: కోర్టుపై నాని నమ్మకమేంటి?
ఒక సినిమాను ఆడియన్స్ లోకి ఎలా తీసుకెళ్లాలి? ఏం చేసి సినిమాను ఇంకా బాగా ప్రమోట్ చేయొచ్చనే విషయంలో భిన్నంగా ఆలోచిస్తూ ఉంటాడు నేచురల్ స్టార్ నాని(Natural Star Nani). ఇప్పుడు తన సొంత బ్యానర్ లో రూపొందిన కోర్టు(Court) సినిమా మార్చి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ జగదీష్(Ram Jagadeesh) ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. అయితే కోర్టు ప్రమోషన్స్ లో నాని ఈ సినిమా గురించి చాలా గొప్పగా చెప్పాడు. ఈ సినిమాకు వర్క్ చేసిన వారంతా చాలా టాలెంటెడ్ అని, ఇలాంటి కోర్టు రూమ్ డ్రామాలు తెలుగులో చాలా అరుదుగా వస్తాయని, ప్రతీ ఒక్కరూ ఈ సినిమాను థియేటర్లలో చూడాలని నాని కోరాడు.
ఇప్పటివరకు తానెప్పుడూ ఆడియన్స్ ను ఫలానా సినిమాను థియేటర్లలోనే చూడమని చెప్పలేదని కానీ ఈ సినిమాకు చెప్తున్నానని, మనం ఎన్నో సినిమాలను చూస్తే వాటిలో కొన్ని మాత్రమే మనల్ని సంతృప్తి పరుస్తాయని, అందులో కోర్టు కూడా ఒకటిగా ఉంటుందని, సినిమా చూశాక ప్రతి ఒక్కరూ మంచి సినిమా చూశామనే ఫీలింగ్ తో థియేటర్ నుంచి బయటికొస్తారని చెప్తున్నాడు నాని. ఇప్పటివరకు తానెప్పుడూ ఆడియన్స్ ను ఫలానా సినిమాను థియేటర్లలోనే చూడమని చెప్పలేదని కానీ ఈ సినిమాకు చెప్తున్నానని, మనం ఎన్నో సినిమాలను చూస్తే వాటిలో కొన్ని మాత్రమే మనల్ని సంతృప్తి పరుస్తాయని, అందులో కోర్టు కూడా ఒకటిగా ఉంటుందని, సినిమా చూశాక ప్రతి ఒక్కరూ మంచి సినిమా చూశామనే ఫీలింగ్ తో థియేటర్ నుంచి బయటికొస్తారని చెప్తున్నాడు నాని.
ఒకవేళ తాను చెప్పింది తప్పు అనిపిస్తే మరో రెండు నెలల్లో తను చేస్తున్న హిట్3(Hit3) సినిమా చూడటం మానేయమని నాని సంచలన కామెంట్స్ చేశాడు. దీంతో నానికి కోర్టుపై అంత నమ్మకమేంటని అందరూ అంటున్నారు. ఇదిలా ఉంటే రీసెంట్ గా రిలీజైన కోర్టు ట్రైలర్ చాలా ఇంప్రెస్సివ్ గా ఉంది. ట్రైలర్ రిలీజయ్యాక సినిమాపై అంచనాలు కూడా బాగా పెరిగాయి.













