The Paradise: ప్యారడైజ్ లో అడుగుపెట్టిన నాని

నేచురల్ స్టార్ నాని(Nani) దసరా(Dasara) సినిమాతో మంచి మాస్ మార్కెట్ ను ఏర్పరచుకున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) నానిని దసరా సినిమాలో ఎంతో మాస్ గా ప్రెజెంట్ చేశాడు. దసరా మంచి హిట్ గా నిలవగా, ఇప్పుడు వారిద్దరి కలయికలో ది ప్యారడైజ్(The Paradise) అనే పాన్ ఇండియన్ సినిమా రాబోతుంది. ఆల్రెడీ ఈ సినిమా నుంచి వచ్చిన రా స్టేట్‌మెంట్(Raw Statement) అనే గ్లింప్స్ కు అన్ని భాషల ఆడియన్స్ నుంచి విపరీతమైన స్పందన వచ్చింది.
ఆల్రెడీ ది ప్యారడైజ్ షూటింగ్ మొదలవగా, జూన్ 21 నుంచి చిన్న చిన్న సీన్స్ తో షూటింగ్ ను మొదలుపెట్టారు. ఈ సినిమా కోసం హైదరాబాద్ లో ఓ స్పెషల్ సెట్ ను భారీగా నిర్మించగా, ఆ సెట్ లోనే 40 రోజుల పాటూ కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారట. అయితే తాజాగా నాని ది ప్యారడైజ్ సెట్స్ లో జాయిన్ అయ్యాడు. ఈ విషయాన్ని స్వయంగా డైరెక్టర్ శ్రీకాంత్ తన ట్విట్టర్ లో షేర్ చేశాడు.
ది ప్యారడైజ్ సెట్స్ లో నాని అడుగుపెట్టాడనే విషయాన్ని తెలియచేస్తూ ధగద్ ఆగయా అంటూ నాని కాలు ఫోటోను పోస్ట్ చేశాడు శ్రీకాంత్. దసరా తర్వాత నాని- శ్రీకాంత్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో అందరికీ ది ప్యారడైజ్ పై మంచి అంచనాలున్నాయి. అనిరుధ్(anirudh) సంగీతం అందిస్తున్న ఈ సినిమా చాలా కొత్త కథాంశంతో తెరకెక్కుతుందని, టాలీవుడ్ లో ది ప్యారడైజ్ ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలవడం ఖాయమని అంటున్నారు.
https://x.com/odela_srikanth/status/1938882780336922883