Hit3: నాని డెసిషనే కరెక్ట్

నాని(Nani) హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా వరుస సక్సెస్ లు అందుకుని మంచి జోష్ లో ఉన్నాడు. నాని ఏదైనా చేసేటప్పుడు ఎంతో ఆలోచించే నిర్ణయం తీసుకుంటూ ఉంటాడనే సంగతి ఇప్పుడు మరోసారి ప్రూవ్ అయింది. హిట్3(Hit3) సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసిన నాని ఆ సినిమాను నార్త్ లో మాత్రం కేవలం సింగిల్ స్క్రీన్లకే పరిమితం చేశాడు.
దానికి కారణం అక్కడ మల్టీప్లెక్సుల్లో షో పడాలంటే సినిమా ఓటీటీ రిలీజ్ కు కనీసం 50 రోజులు గ్యాప్ ఉండాలనే రూల్ ఉంది. దానికి ఒప్పుకుంటేనే నార్త్ మల్టీప్లెక్సుల్లో షో పడుతుంది. నాని హిట్3 విషయంలో ఆ రూల్ కు నో చెప్పి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్(Netflix) తో డీల్ సెట్ చేసుకున్నాడు. కేవలం 28 రోజుల గ్యాప్ తో హిట్3 స్ట్రీమింగ్ డీల్ కు నాని ఒప్పుకున్నాడు.
కట్ చేస్తే హిట్3 సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన రెస్పాన్స్ నార్త్ నుంచి రాలేదు. మే 29 నుంచి నెట్‌ఫ్లిక్స్ లోకి హిట్3 రానుంది. దీన్ని బట్టి చూస్తుంటే ఈ విషయంలో నాని తీసుకున్న నిర్ణయం కరెక్టే అనిపిస్తుంది. నార్త్ ఆడియన్స్ ను నమ్ముకుని మల్టీప్లెక్స్ డీల్ కు ఒప్పుకుని ఉంటే నెట్‌ఫ్లిక్స్ హిట్3 ను కాస్త తక్కువ రేటుకు కొనేది. తద్వారా నాని నష్టపోయేవాడు. ఇప్పుడు ఈ విషయం తెలిసిన వారంతా నాని నిర్ణయమే కరెక్ట్ అని ఒప్పుకుంటున్నారు.