ఈసారి 100 కోట్లు కొట్టడం నానికి ఈజీనే
అంటే సుందరానికీ తర్వాత నాని హీరోగా వస్తున్న సినిమా దసరా. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నాని కెరీర్లో మొదటి పాన్ ఇండియన్ ఫిల్మ్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ దగ్గరనుంచి దసరా పై అంచనాలు పెంచుతూనే ఉంది చిత్ర బృందం. నాని తన కెరీర్లో ఇంతకు ముందెప్పుడూ చేయని మాస్ క్యారెక్టర్లో ఈ సినిమాలో కనిపిస్తున్నాడు.
ఇక అప్పటి వరకు ఉన్న అంచనాలను టీజర్ అమాంతంగా డబుల్ చేసేసింది. పాటలు కూడా బాగున్నాయి. దీంతో ఈ సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ కంటే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు. మార్చి 30న రిలీజ్ కానున్న దసరా సినిమాతో థియేటర్లను పూర్తిగా నింపాలనే ఆలోచనతో ఉన్నారు డిస్ట్రిబ్యూటర్లు.
దానికితోడు దసరాకు ప్రీ రిలీజ్ బిజినెస్ చాలా బాగా జరిగింది. ఇంకా థియేటర్లలోకి రాకముందే సినిమా వంద కోట్ల మార్కు దాటేసిందని ఇండస్ట్రీ టాక్. డిజిటల్ రైట్స్ ఒక్కటే 35 కోట్లకు పైగా అమ్ముడు పోయాయట. టీజర్ తో ఇంప్రెస్ అయిన నెట్‌ఫ్లిక్స్ సినిమాకు చాలా మొత్తంలో ఆఫర్ చేసిందని టాక్. వాల్తేరు వీరయ్యను యాభై కోట్లకు కొన్న ఈ ఓటీటీకి తర్వాత పెద్ద మొత్తం ఇదేనట. దీనికన్నా ఎక్కువగా డబ్బింగ్ రేట్ పలుకుతోంది.
హిందీ, మలయాళం, కన్నడ, తమిళం అన్ని భాషల్లోనూ సినిమా రిలీజ్ ఉంది కాబట్టి అవన్నీ కలిపి ఇంకో నలభై కోట్లయినా వచ్చే అవకాశాలున్నాయి. అన్నీ బాగుండి పాజిటివ్ టాక్ వచ్చి సినిమా ముప్పై కోట్లు చేసినా సరే దసరా 100కోట్ల మైలురాయిని అందుకుంటుంది. నానికి జోడీగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నాని కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిస్తే మాత్రం నాని మార్కెట్ డబుల్ అవడం ఖాయం.













