లిప్ లాక్స్ పై నాని కామెంట్స్
ఒకప్పుడు లిప్ లాక్స్ అనేవి వేరే భాషల సినిమాల్లోనే ఉండేవి. కానీ ఇప్పుడు టాలీవుడ్ లో కూడా ఇవి చాలా కామన్ అయిపోయాయి. సీన్ డిమాండ్ చేస్తే ఎంతటి స్టార్ హీరో అయినా సరే ఈ లిప్ లాక్ సీన్స్ కు నో చెప్పకుండా నటించేస్తున్నారు. రీసెంట్గా నాని నటించిన హాయ్ నాన్న సినిమాల్లో కూడా ఈ లిప్‌లాక్స్ ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి.
గతంలో జెర్సీ, శ్యామ్ సింఘరాయ్ లాంటి సినిమాల్లో లిప్ లాక్ సీన్స్ చేసిన నాని, ఇప్పుడు హాయ్ నాన్న సినిమాలో ఆ డోస్ కాస్త పెంచినట్లు కనిపిస్తుంది. మొన్న రిలీజ్ అయిన టీజర్లోనే లిప్ లాక్ సీన్స్ పెట్టారంటే ఇక సినిమాలో రొమాంటిక్ సీన్స్ ఏ రేంజ్లో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.
ఈ మధ్య మీరు బాగా లిప్ లాక్స్ సీన్స్ చేస్తున్నట్టున్నారు? అనే ప్రశ్న నానిని అడిగితే దానికి నాని ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చాడు. తాను నటించిన అన్ని సినిమాల్లో లిప్ లాక్ సీన్స్ లేవని, డైరెక్టర్ ఆ సీన్ తప్పకుండా అవసరమని పట్టుబడితే చేస్తానని, అంతకుమించి అలాంటి సీన్స్ లో నటించాలనే ఇంట్రెస్ట్ తనకు స్పెషల్ గా లేదని, అప్పుడప్పుడు తప్పక ఇలాంటి సీన్స్ లో నటించినప్పుడు ఇంట్లో చాలా పెద్ద గొడవలవుతాయని నాని చెప్పుకొచ్చాడు. బయట ఎంత హీరోలైనా ఇంట్లో తమ భార్యకు ఏ స్టారైనా భర్తే కదా.













