The Paradise: ది ప్యారడైజ్ లో నాని క్యారెక్టర్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్
దసరా(Dasara) సినిమాతో నేచురల్ స్టార్ నాని(Nani)కి మంచి మాస్ ఇమేజ్ వచ్చింది. అప్పటివరకు నానిని పక్కింటి అబ్బాయిగా చూసిన ఆడియన్స్ ఆ సినిమాతో నానిలో మాస్ యాంగిల్ కూడా ఉందని నమ్మారు. నానికి ఆ ఇమేజ్ ను తెచ్చిన డైరెక్టర్ గా మరియు మొదటి సినిమాతోనే తనలో మ్యాటర్ ఉందని అనిపించుకున్న డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela). దసరా సక్సెస్ తో శ్రీకాంత్ కు మంచి పేరొచ్చింది.
శ్రీకాంత్ ప్రస్తుతం నానితోనే ది ప్యారడైజ్(the paradise) అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అనౌన్స్మెంట్ గ్లింప్స్ తోనే ఈ మూవీ ఆడియన్స్ లో భారీ బజ్ ను క్రియేట్ చేయగా ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ వేగంగా జరుగుతుండగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలుస్తోంది. ది ప్యారడైజ్ లో నాని క్యారెక్టర్ లో మూడు కోణాలుంటాయని, అందులో నాని నెగిటివ్ షేడ్స్ లో కూడా కనిపిస్తాడని అంటున్నారు.
యాక్షన్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాస్ కు ఫుల్ మీల్స్ పెట్టే అంశాలు చాలానే ఉంటాయని అంటున్నారు. భారీ బడ్జెట్ తో సుధాకర్ చెరుకూరి(sudhakar cherukuri) ఈ సినిమాను నిర్మిస్తుండగా, అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీలో నాని పక్కన ఎవరు జత కట్టనున్నారనేది మాత్రం ఇంకా తెలియలేదు. ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాకుండానే ఓవర్సీస్ రైట్స్ ను ప్రత్యంగిర ఫిల్మ్స్(Pratyangira films) భారీ రేటుకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.







