బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో నాని బిజీ
గతేడాది దసరా సినిమాతో బాక్సాఫీస్ వద్ద మొదటిసారి రూ.100 కోట్ల మార్క్ ను టచ్ చేసిన నాని, హాయ్ నాన్న తో మరో సెన్సిబుల్ హిట్ ను అందుకున్నాడు. హాయ్ నాన్న తర్వాత వెంటనే వివేక్ ఆత్రేయతో సరిపోదా శనివారం అనే డిఫరెంట్ యాక్షన్ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లిన నాని, ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది.
ఆగస్ట్ 29న సరిపోదా శనివారం రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా కోసం 5 నెలలు హార్డ్ వర్క్ చేసిన నాని, వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేయాలని చూస్తున్నాడట. ఆ తర్వాత మరో కొత్త డైరెక్టర్ తో నాని సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే ఛాన్సుందట. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆ సినిమాను కూడా 5 నెలల్లోనే పూర్తి చేయొచ్చు.
దీంతో పాటూ సుజిత్ దర్శకత్వంలో మాఫియా బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఓ సినిమాను చేయనున్నాడు. ఓజీ మూవీ పూర్తయ్యాక ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందట. ఈ సినిమా కోసం నాని 3 నెలల డేట్స్ మాత్రమే ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇది కాకుండా వేణు యెల్దండితో ఎల్లమ్మ అనే సినిమాను చేయనున్నాడు నాని. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశముందట. పీరియాడికల్ జానర్ లో ఈ సినిమా రూపొందనుందని టాక్. మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో నాని చాలా బిజీగా ఉన్నాడు. ఇక నుంచి సంవత్సరానికి కనీసం రెండు సినిమాలతో అయినా ఆడియన్స్ ను పలకరించాలని నాని గట్టిగా ఫిక్సయ్యాడట.













