మరోసారి ఎం.సీ.ఎ జంట సందడి
ఎం.సి.ఎ (మిడిల్ క్లాస్ అబ్బాయి) తో ఆకట్టుకున్న జంట నాని, సాయిపల్లవి. వీరిద్దరూ మరోసారి వెండి తెరపై సందడి చేయడానికి సిద్ధం అవుతున్నారు. నాని కథానాయకుడిగా సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఓ చిత్రాన్ని రూపొందించనుంది. నాగవంశీ నిర్మాత. టాక్సీవాలా తో ఆకట్టుకున్న రాహుల్ సంకృత్యాన్ దర్శకుడు. ఈ చిత్రంలో కథానాయిక పాత్ర కోసం సాయిపల్లవి పేరు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం టక్ జగదీష్ సినిమాతో బిజీగా ఉన్నారు నాని. ఆ తరువాతే రాహుల్ సినిమా పట్టాలెక్కుతుంది. 2021 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశాలున్నాయి. నాని కథానాయకుడిగా నటించిన వి చిత్రం ఈ ఉగాదిన విడుదల కానుంది. మరోవైపు సాయి పల్లవి చేతిలో రెండు చిత్రాలు ఉన్నాయి. విరాటపర్వం, లవ్‌స్టోరీ చిత్రాలతో బిజీగా ఉంది సాయి పల్లవి.













