కల్కి లో సరికొత్త క్యామియోలు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా సినిమా కల్కి 2989ఏడి. ఈ సినిమా మే 9న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. కానీ పాన్ ఇండియా సినిమాల వాయిదా వార్తలు ఎక్కువ అవుతున్న టైమ్ లో కల్కి కూడా వాయిదా పడుతుందనే అనుమానాలు బాగా ఎక్కువవుతున్నాయి.
అయితే మేకర్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కల్కిని చెప్పిన డేట్ కే రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. మేకర్స్ చెప్తున్న దాన్ని బట్టి చూస్తే మరో మూడు నెలల్లో ప్రభాస్ ను కల్కిగా బిగ్ స్క్రీన్ పై చూడొచ్చు. అయితే ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ కూడా ఉంటారని వార్తలొస్తున్న విషయం తెలిసిందే. అధికారికంగా ఇంకా చెప్పలేదు కానీ వారి క్యామియోల విషయం నిజమేనంటున్నారు.
తాజా సమాచారం ప్రకారం కల్కిలో గెస్ట్ రోల్స్ లిస్ట్ ఆగదని తెలుస్తోంది. క్లైమాక్స్ కు ముందొచ్చే కీలక సన్నివేశంలో కృపాచార్యగా నేచురల్ స్టార్ నాని కనిపించనున్నాడని అంటున్నారు. అంతేకాదు పరశురాముడిగా కొన్ని నిమిషాల పాటూ జూ. ఎన్టీఆర్ కూడా కనిపిస్తాడని తెలుస్తోంది. ఈ రెండు క్యామియోలు ఉంటాయా ఉండవా అన్నది ఇప్పుడే చెప్పలేం కానీ నిప్పు లేనిదే పొగ రాదు కదా అన్నట్లు అందరూ అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. ఇదంతా చూస్తుంటే కల్కి కోసం నాగ్ అశ్విన్ ఏదో చాలా గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లున్నాడు. రెండు భాగాలుగా రిలీజ్ కానున్న కల్కి ఓ వైపు పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ జరుపుకుంటూనే మరో వైపు షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తోంది.













