Nani: విశ్వక్ సేన్ తో గొడవపై నాని క్లారిటీ
హీరో విశ్వక్సేన్(Viswaksen)తో వివాదంపై నేచరల్ స్టార్ నాని(Nani) వివరణ ఇచ్చాడు. ప్రస్తుతం హిట్-3(Hit3) సినిమా ప్రమోషన్స్‌లో నాని బిజీబిజీగా ఉన్నాడు. నాని హీరోగా నటించిన ఈ పాన్ ఇండియా మూవీ వచ్చే మే 1వ తేదీన వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుండడం తెలిసిందే. ఈ మూవీకి నానినే ప్రొడ్యూసర్ కూడా కావడంతో ప్రమోషన్స్ ఇంకా ఎక్కువగా చేస్తున్నాడు. నాని ప్రొడ్యూసర్‌గా నిర్మించిన హిట్1(Hit1), హిట్2(Hit2) చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధించాయి.
అయితే, విశ్వక్ సేన్‌తో వచ్చిన గొడవలు వల్లనే అతడి స్థానంలో హిట్-2లో శేష్‌ను హీరోగా పెట్టారనే ప్రచారం చాలా రోజులుగా కొనసాగుతోంది. ఈ ప్రచారానికి హిట్-3 ప్రమోషన్స్‌లో నాని ముగింపు పలికాడు. విశ్వక్ సేన్‌తో తనకు ఎప్పుడూ ఎలాంటి గొడవలు లేవని నాని స్పష్టం చేశాడు. హిట్-1కు కథ సిద్ధం కాకముందే విశ్వక్‌ను హీరోగా ఫిక్స్ అయ్యామని, అనంతరం ఆ సిరీస్ పెద్దగా మారిపోవడంతో రెండో పార్ట్‌కు అడివి శేష్(Adivi Sesh)ను హీరోగా అనుకున్నామని వివరణ ఇచ్చాడు.
ఈ హిట్ సిరీస్‌ను ఒక్కరిని దృష్టిలో పెట్టుకుని రూపొందించింది కాదని, అందుకే మూడో పార్ట్‌లో తాను హీరోగా నటిస్తున్నానని స్పష్టత ఇచ్చాడు. భవిష్యత్‌లో రాబోయే హిట్ సిరీస్‌లో తిరిగి విశ్వక్(Viswak), శేష్ కనిపిస్తారేమో కథను బట్టి వేచి చూడాల్సి ఉందని నాని చెప్పుకొచ్చాడు. ప్రొడ్యూసర్‌గా ఇకపై తాను నిర్మించే ప్రతి మూవీను పాన్ ఇండియా రేంజ్‌లోనే రూపొందిస్తానని చెప్పాడు. సినిమా ప్రమోషన్స్‌ను కూడా అదే రేంజ్లో చేస్తానని స్పష్టం చేశాడు. ఇక, కొలను శైలేష్(Sailesh Kolanu) దర్శకత్వంలో వస్తున్న హిట్-3 సినిమాలో కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి(Sreenidhi Shetty) హీరోయిన్గా నటించగా, మిక్కీ జే మేయర్(Mickey J Mayor) ఈ థ్రిలర్ మూవీకు మ్యూజిక్ అందించాడు.






