Nani: ప్యారడైజ్ గురించి హైప్ పెంచేసిన నాని
వరుస సక్సెస్లతో ఫుల్ జోష్ లో ఉన్న నాని(Nani), ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ చాలా బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం శైలేష్ కొలను(Sailesh Kolanu) దర్శకత్వంలో హిట్3(Hit3) చేస్తున్న నాని ఆ సినిమాను మే 1న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. హిట్3 తర్వాత నాని శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో ది ప్యారడైజ్(The Paradise) చేయనున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాని, ది ప్యారడైజ్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ది ప్యారడైజ్ మూవీ తాను శ్రీకాంత్ తో చేసిన దసరా కంటే భారీగా ఉండనుందని, ఈసారి శ్రీకాంత్ చాలా గట్టిగా ప్లాన్ చేసుకున్నాడని, మూవీ లో ప్రతీ సీన్ ఆడియన్స్ కు చాలా హై ఇస్తుందని, ది ప్యారడైజ్ లో ఎవరూ ఊహించని ఎలిమెంట్స్ ఎన్నో ఉంటాయని నాని తెలిపాడు.
ప్రెజెంట్ తాను ది ప్యారడైజ్ లుక్ కోసం పూర్తిగా మేకోవర్ అవుతున్నానని చెప్పిన నాని, ఆ మూవీలో తన క్యారెక్టర్ కు అందరూ షాకవుతారని చెప్తున్నాడు. ది ప్యారడైజ్ త్వరలోనే షూటింగ్ కు వెళ్లనుందని తెలిపాడు. వచ్చే ఏడాది మార్చి 26న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. ఇప్పటికే ప్యారడైజ్ నుంచి రిలీజైన రా స్టేట్మెంట్ కు ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే.













