Nani: సుజిత్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన నాని
వరుస సక్సెస్లతో దూసుకెళ్తున్న నేచురల్ స్టార్ నాని(Nani) ప్రస్తుతం హిట్3(Hit3) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు. మే 1న హిట్3 రిలీజ్ కానుంది. శైలేష్ కొలను(Sailesh Kolanu) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్స్ లో నాని చాలా యాక్టివ్ గా పాల్గొంటూ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడిస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. హిట్3 ప్రమోషన్స్ లో నాని సుజిత్(Sujeeth) తో చేయాల్సిన సినిమా గురించి క్లారిటీ ఇచ్చాడు.
సుజిత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య(DVV Danayya) నిర్మాణంలో నాని ఓ సినిమాను గతేడాదే అనౌన్స్ చేశాడు కానీ ఇప్పటివరకు ఆ సినిమా షూటింగ్ మొదలవలేదు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల నిర్మాత దానయ్య ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడని, ఆ స్థానంలోకి వెంకట్ బొల్లినేని(Venkat Bollineni) చేరాడని అన్నారు. కొందరైతే సుజిత్ తో నాని సినిమా అసలు ఆగిపోయిందని కూడా అన్నారు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు నాని చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. సుజిత్ తో తన సినిమా ఉంటుందని, కాకపోతే షూటింగ్ కొంచెం లేటవుతుందని, 2027లో తమ సినిమా రిలీజవుతుందని నాని క్లారిటీ ఇచ్చాడు. ఓజి(OG) సినిమాతో సుజిత్ లాక్ అవడం వల్ల తమ సినిమా ఆలస్యమవుతుంది తప్పించి తమ సినిమా ఆగిపోలేదని నాని స్పష్టత ఇచ్చాడు.






