Sailesh Kolanu: ఆ డైరెక్టర్ ముందే ఎలా ఊహిస్తున్నాడు?
వరుస హిట్లతో మంచి ఫామ్ లో ఉన్న నాని(Nani) ఇప్పుడు హిట్3(Hit3) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు. మే 1న ఈ సినిమా రిలీజ్ కానుంది. శైలేష్ కొలను(sailesh Kolanu) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను నాని తెగ ప్రమోట్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే హిట్3 రిలీజయ్యాక ఒక సీన్ గురించి ఆడియన్స్ కొన్నాళ్ల పాటూ చర్చించుకుంటారని తెలుస్తోంది.
యాక్షన్ థ్రిల్లర్ గా వస్తోన్న ఈ సినిమా షూటింగ్ కశ్మీర్ లో కూడా జరిగిన విషయం తెలిసిందే. ఈ మూవీలో కశ్మీర్ లో తీసిన సీన్స్ చూశాక ఆడియన్స్ షాకవుతారని తెలుస్తోంది. రీసెంట్ గా పహల్గాం(pahalgam)లో జరిగిన ఉగ్రదాడి లాంటిదే సినిమాలో కూడా ఒకటుంటుందని, అర్జున్(arjun sarkar) సర్కార్ కశ్మీర్ లో పని చేసేటప్పుడు అలాంటి దాడి జరిగితే అతను ఉగ్రవాదులపై ఎలా తిరగబడ్డాడనేది శైలేష్ నెక్ట్స్ లెవెల్ లో చూపించాడని అంటున్నారు.
అయితే పహల్గామ్ లో ఎటాక్ జరిగింది నాలుగు రోజుల కిందటే. కానీ శైలేష్ ఈ సీన్స్ ను నెల రోజుల ముందే షూట్ చేశాడు. హిట్1(Hit1) చేసేటప్పుడు కూడా దిశా ఘటన లాంటిది ఒకటి సినిమాలో చూపించాడు. తీరా చూస్తే అలాంటి ఘటనే సినిమా రిలీజ్ కు ముందు జరిగింది. ఇప్పుడు హిట్3 టైమ్ లో కూడా అలాంటిదే జరగడం చూసి శైలేష్ అన్నీ ముందే ఎలా ఊహిస్తున్నాడని అంటున్నారు.






