Nani: ఆ టీ షర్టు చాలా మెమొరబుల్
ఆర్జే(RJ)గా కెరీర్ ను మొదలుపెట్టిన నాని(Nani), ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి వచ్చి మెల్లిగా హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం హీరోగా సినిమాలు చేస్తూనే నిర్మాతగా కూడా మారి పలు సినిమాలను నిర్మిస్తూ కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం దసరా(dasara) ఫేమ్ శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో ది ప్యారడైజ్(The Paradise) చేస్తున్నాడు నాని(nani). ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
కాగా నాని రీసెంట్ గా జగపతి బాబు(jagapathi Babu) హోస్ట్ చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా(Jayammu Nischayammura) అనే టాక్ షో కు గెస్ట్ గా రాగా, ఆ షోలో నాని గురించి ఎవరికీ తెలియని పలు ఇంట్రెస్టింగ్ విషయాలు బయటికొచ్చాయి. షోలో భాగంగా జగపతి బాబు నాని పాత టీ షర్ట్ ను చూపించగా దాన్ని చూసి నాని షాకై ఆ టీ షర్ట్ వెనుక ఉన్న కథ గురించి బయట పెట్టాడు.
తన ఫస్ట్ ఫోటో షూట్ ఆ టీ షర్ట్ పైనే అయిందని, అష్టాచెమ్మా(ashta chemma) మూవీ ఆడిషన్స్ కోసం ఫోటోలు కావాలని అడిగినప్పుడు జూబ్లాహిల్స్ లోని పార్క్ లోని ఆ షర్ట్ మీద అప్పటికప్పుడు ఫోటోలు దిగి పంపానని, తర్వాత తన భార్య అంజు(anju)ని ఫస్ట్ టైమ్ కలవడానికి వెళ్లినప్పుడు కూడా అదే టీ షర్ట్ వేసుకున్నానని అందుకే ఆ టీ షర్ట్ ఎంతో స్పెషల్ అని, అంజు దాన్ని చాలా భద్రంగా దాచినట్టు చెప్పాడు నాని. 17 ఏళ్లైనా ఆ టీషర్టును అంతే భద్రంగా దాచడం తెలిశాక నాని ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారు.













