Nani: మెగా ప్రాజెక్టుపై నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దసరా(Dasara) డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి(megastar chiranjeevi) హీరోగా నాని(nani) నిర్మాతగా సినిమా రానున్న విషయం తెలిసిందే. అనౌన్స్మెంట్ నుంచే ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా? ఎప్పుడు ఈ సినిమా నుంచి అప్డేట్స్ వస్తాయా అని అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో హిట్3(Hit3) ప్రమోషన్స్ లో నాని ఆ సినిమాపై కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలిపాడు. చిరంజీవి- శ్రీకాంత్ సినిమా ప్యారడైజ్(Paradise) తర్వాత రానుందని, ఆ సినిమాను 2027లో రిలీజ్ చేయనున్నామని, సినిమాకు సంబంధించిన మిగిలిన అప్డేట్స్ షూటింగ్ మొదలయ్యాక ఇస్తామని, చిరంజీవి గారంటే తనకు మాటల్లో చెప్పలేని అభిమానమని నాని వెల్లడించాడు.
చిరూ సినిమాకు ప్రొడ్యూసర్ గా ఉంటే తనకు ఓ బయోపిక్ తీస్తున్న ఫీలింగ్ వస్తుందని, ప్రతీ క్షణం ఆ సినిమా కోసమే ఆలోచిస్తున్నానంటూ, అదొక ఫ్యాన్ బాయ్ మూమెంట్ అని, దాని కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నానని నాని తెలిపాడు. నాని చెప్పిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాని మాటల్ని బట్టి చూస్తుంటే ఈ మెగా ప్రాజెక్టుకు చాలానే టైముందని క్లారిటీ వచ్చింది.






