Nani: ఎప్పటికైనా అలాంటి ఎపిక్ మూవీ చేయాలి
బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లతో మంచి జోష్ లో ఉన్న నేచురల్ స్టార్ నాని(Nani) నటించిన హిట్3(Hit3) సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాని మీడియాతో మాట్లాడుతూ కొన్ని విషయాలను వెల్లడించాడు. హిట్ సినిమాలో యాక్షన్, వయొలెన్స్ ఎక్కువగా ఉంటుందని, సాఫ్ట్ ఆడియన్స్ ఈ సినిమాకు రావొద్దని నాని చెప్పిన సంగతి తెలిసిందే.
అయితే నాని అలా చెప్పడం వెనుక ఉన్న కారణాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. సినిమాలో ఎలాంటి కంటెంట్ ఉందో ముందే ఆడియన్స్ కు క్లారిటీ ఇవ్వడం వల్ల వాళ్లు డిజప్పాయింట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని, అలా కాకుండా వాళ్లు ఓ అంచనాతో వచ్చి సినిమాలో అది లేకపోతే తర్వాత సినిమా బాలేదనే ముద్ర పడిపోతుందని అందుకే తాను ముందే హిట్3 సినిమాలోని కంటెంట్ గురించి క్లారిటీ ఇచ్చినట్టు నాని తెలిపాడు.
కామెడీ సినిమాలను ఎక్కువగా ఇష్టపడే తన పిన్నికి తాను చేసిన దసరా(Dasara) సినిమా నచ్చేలేదని, అందుకే ఆమెను హిట్3 టీజర్, ట్రైలర్ కూడా చూడొద్దని చెప్పినట్టు నాని వెల్లడించాడు. ఇదే సందర్భంగా నాని తన డ్రీమ్ మూవీని కూడా వెల్లడించాడు. తనకు బెన్ హర్(Ben Her) లాంటి ఎపిక్ సినిమా చేయాలనే కోరిక ఉందని, కానీ ఇన్నాళ్లూ తనకు అంత స్థాయి రాలేదని ఆ ప్రయత్నం చేయలేదని, ఇప్పుడు తనకు ఆ మార్కెట్ వచ్చిందని నాని చెప్తున్నాడు. కొంచెం లేటైనా సుజిత్(Sujeeth) తో ప్రాజెక్ట్ తప్పకుండా ఉంటుందని చెప్తున్న నాని, ఈ ఇయర్ తన నుంచి హిట్3 మాత్రమే రాబోతున్నట్టు వెల్లడించాడు.













