Hit3: హిట్3 అసలు చేయాలనుకోలేదు
వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉన్న నాని(Nani) చేతిలో ప్రస్తుతం హిట్3(Hit3), ది ప్యారడైజ్(the paradise) సినిమాలున్న సంగతి తెలిసిందే. మే1 హిట్3 ప్రేక్షకుల ముందుకు రానుంది. శైలేష్ కొలను(sailesh kolanu) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కు దగ్గర పడటంతో ప్రమోషన్స్ లో భాగంగా నాని మీడియా ముందుకొచ్చి పలు ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నాడు.
తానసలు హిట్3 సినిమా చేద్దామనుకుని ప్లాన్ చేయలేదని, హిట్2(hit2) క్లైమాక్స్ లో ఓ క్యామియో చేస్తే బావుంటుందని డైరెక్టర్ శైలేష్ చెప్పడంతో అప్పటికప్పుడు అన్నీ సెట్ చేసుకుని ఆ క్యారెక్టర్ ను చేశానని, హిట్3 చేసినప్పుడు సంగతిలే అని లైట్ తీసుకున్నానని నాని చెప్పాడు. దానికి కారణం తాను పలు ప్రాజెక్టులతో బిజీగా ఉండటమే అని నాని చెప్పాడు.
కానీ తాను కమిట్ అయిన సినిమాల్లో ఒక సినిమాకు గ్యాప్ రావడంతో ఆ టైమ్ లో శైలేష్ ను పిలిచి కథ ఉందా అంటే తాను కథ చెప్పడం, ఆ కథ నచ్చడం, సినిమా పట్టాలెక్కడం త్వరత్వరగా జరిగిపోయాయని చెప్పిన నాని, హిట్3లో వయొలెన్స్ కు సమానంగా ఇన్వెస్టిగేషన్ కూడా ఉంటుందని, కాకపోతే యాక్షన్, వయొలెన్స్ ను కాస్త ఎక్కువగా చూపించామని నాని తెలిపాడు.













