సమంత కొత్త అవతారం
స్టార్ హీరోయిన్ సమంత నిర్మాతగా మారబోతోంది. ఆమె హీరోయిన్గా చేస్తూనే ఓ సినిమా నిర్మించడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో ఓ కొత్త సినిమా త్వరలోనే సెట్స్ మీదకు రానుందని తెలిసింది. తొలుత ఓ కొరియన్ సినిమాని రీమేక్ చేయాలని నందిని రెడ్డి, సమంత అనుకున్నారట. అయితే రీమేక్ కంటే స్ట్రెయిట్ సినిమా వైపే సమంత మొగ్గు చూపిందనీ.. ఈ నేపథ్యంలో నందిని రెడ్డి ఓ ఆసక్తికరమైన కథాంశాన్ని ఎంచుకొని స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిందని అంటున్నారు. ఇక వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఓ బేబీ మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో ఇంకో సినిమా అంటే ఆ సినిమాపై అంచనాలు భారీగానే వుంటాయి.













