రామోజీ రావు గారు ఆకస్మిత మరణం మనందరికీ తీరనిలోటు : నందమూరి రామకృష్ణ
ఈనాడు గ్రూప్ / మార్గదర్శి సంస్థల అధినేత రామోజీ రావు గారు ఆకస్మిత మరణం మనందరికీ తీరనిలోటు…వారు తండ్రిసమానులు. ఒక రైతు కుటుంబములో జన్మించి వ్యవసాయంలో వారి తండ్రుకి చేదోడుగా ఉంటూ కష్టపడి చదువుకున్నారు రామోజీ రావు గారు అన్ని రంగాల్లో వారు సేవలందించారు. ఇటు ప్రెస్ మీడియా/జర్నలిజం లీడరే కాకుండా….మార్గదర్శి చిట్స్ / ఫైనాన్స్ చైర్మన్ గాను… సినీ నిర్మాతగా, సినీ స్టూడియో అధినేతగా…వివిధ రంగాల్లోనూ చాలామందికి ఉద్యోగాలు కల్పించి అందరిని ఆదుకున్నారు రామోజీ రావు గారు.
వారెక్కడున్న వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ… మా కుటుంభం తరఫున వారి కుటుంభానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాము.
మీ
నందమూరి రామకృష్ణ













