మోక్షజ్ఞను చూసి మురిసిపోతున్న నందమూరి ఫ్యాన్స్
నందమూరి తారక రామారావు వారసుడిగా టాలీవుడ్ ని ఏలుతున్నాడు నందమూరి బాలకృష్ణ. బాలయ్య ఫ్యాన్స్ ఎప్పటినుంచో అతని కొడుకు మోక్షజ్ఞ అరంగేట్రం కోసం వెయిట్ చేస్తున్నారు. ఆదిత్య 999 మ్యాక్స్ అనే సినిమాతో మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వనున్నాడని బాలయ్య చెప్పి కూడా రెండేళ్లవుతుంది. కానీ ఇప్పటివరకు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి అప్డేట్ లేదు.
రీసెంట్ గా మోక్షజ్ఞ స్లిమ్ లుక్ లో కనిపించడంతో తన వెండితెర అరంగేట్రానికి ప్రిపరేషన్స్ మొదలయ్యాయని అందరూ తెగ సంతోషించారు. మోక్షజ్ఞ నటన, డ్యాన్సులు, ఫైట్లలో ట్రైనింగ్ తీసుకుంటున్నాడని కూడా ఆ మధ్య వార్తలొచ్చాయి. తాజాగా మోక్షు కొత్త లుక్ లో కనిపించాడు. ఇంతకుముందు కంటే మరింత షార్ప్ గా కనిపిస్తున్నాడు మోక్షజ్ఞ.
ప్రస్తుతం మోక్షజ్ఞకు సంబంధించిన ఆ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా రీసెంట్ దేనా లేక ఏదైనా ఫంక్షన్ నుంచి క్రాప్ చేసిన ఫోటోనా అన్నది తెలియాల్సి ఉంది. ఏదేమైన మోక్షజ్ఞను ఆ లుక్ లో చూసిన నందమూరి ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. ఇదిలా ఉంటే మోక్షు మొదటి సినిమాను స్వయంగా బాలయ్యనే దర్శకత్వం వహించనున్నాడని అంటున్నారు. కాని పక్షంలో బోయపాటి లేదా అనిల్ రావిపూడిలో ఒకరికి ఆ బాధ్యతను అప్పగించనున్నాడట బాలయ్య.













